హిందూ పురాణాల ప్రకారం దేవతలు లేదా దేవుళ్ళు అనగా స్వర్గ లోక నివాసులు, పరమ పవిత్రులు, పూజింపదగిన వారు. హిందూ గ్రంథాల్లో వారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. వారి గురించి ఎన్నో రకాలైన కథలు, పురాణ గాథలు, ఇతిహాసాలు ప్రచారంలో ఉన్నాయి. ఇంత మంది దేవుళ్ళు ఉన్నా పరమేశ్వరుడు ఒక్కడే.
ఆయనే సృష్టి అంతటికీ మూలాధారం. ధర్మాన్ని పరిరక్షించడానికి మరియు సకల మానవాళిని సరియైన దారిలోకి మళ్ళించడానికి స్వర్గం నుంచి మానవ రూపంలో భువి పైన జన్మించిన వారిని అవతార పురుషులు లేదా అవతార మూర్తులు అంటారు. రామావతారం, కృష్ణావతారం మొదలైనవి ఇందులో ముఖ్యమైనవి.
హిందూ మతం చాలా వైవిధ్యమైనది. కొన్ని విశ్వాసాలు ప్రబలంగా ఉన్నప్పటికీ, పండితులు అందరి చేత ఆమోదించబడే విశ్వాసాలను క్రోడీకరించడం కష్టంగా భావిస్తున్నారు.
ధర్మం (నీతి నియమాలు, విధులు), సంసారం, మోక్షం (సంసారం నుండి విముక్తి), మరియు ఇతర యోగ పద్దతులు మొదలైనవి ప్రబలమైనవి.
రచించినది: కోటి మాధవ్ బాలు చౌదరి