|
Ganesha |
కార్తీక మాసం వస్తె అయ్యప్ప మాల వేసే భజనలో కనిపించే స్వాములను చూస్తుంటాం . ఇప్పుడు వినాయ మాలధారణ వేయడం మొదలైనది . ఇది ఎప్పటి నుండో ఉన్నపటికీ బహుల ప్రచారము జతగలేదు . సాదారనము ఈ మాల 1121 రోజులు లేదా 41 రోజులు వేసి దీక్షలో ఉంటారు . 41 రోజు మాలను ధరించేభక్తులు వినాయక చవితికి ముందు 21రోజులు , 21రోజు మాల ధరించే భక్తులు వినాయక చవితిరోజున ధరించడం జరుగుతుందన్నారు. 21 & 41 రోజు అనంతరం దీక్షా విరమణ కాణిపాక సిధ్ది వినాయక దేవాలయంలో గావింపబడుతుంది . వినాయక చవితి రోజున గణేష్దీక్ష మాలాధారణ చేయడం ఆనవాయితీ అని గణేష్ దీక్ష చేపట్టే భక్తులకు స్వామివారి ఆలయం వద్ద దర్శనానికి కూడా ప్రత్యేక సమయం ఏర్పాట్లు చేయనున్నట్లు కానిపాకం ఆయల పూజారి తెలిపారు. గణేష్దీక్ష చేపట్టిన భక్తులందరికి స్వామివారి ఉచిత నిత్య అన్నదానం సత్రంలో భోజన వసతి కల్పించనున్నట్లు ఆయన తెలిపారు.
- ఐదేళ్ళ(5) నుంచి 70 యేళ్ళ వయసు వరకూ ఎవరైనా ఈ దీక్ష తీసుకొని సంకటవిమోచన గణపతిని పూజించవచ్చును
- మాలధారణ చేసిన భక్తులు రోజూ తెల్లవారుజామున నిద్రలేచి ఐదు గంటలకల్లా స్నానాధికాలు ముగించుకోవాలి
- వినాయక దేవాలయము చేరి పూజలు , అభిశేకాలు నిర్వహించాలి . యాగ శాలలో చేరి గణేషుని సేవలో ఇతర కార్యక్రమాల్లో పాల్గొనాలి .9.00 గంటల కల్లా ఎవరివిధులకు వారు వెళ్ళిపోవచ్చును
- మధ్యాహ్నము భిక్ష యదావిధిగా ఉంటుంది
- సాయంత్రము 6.00 గంటలకు గణనాధుని విశేషపూజలు , భజన ఉంటుంది
ఈవిధముగా దీక్షను 21 రోజులు పాటు చేస్తే కార్యసిద్ధి , అభీష్టసిద్ధి కలగడం తో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది . విద్యార్ధులకు విద్య , ధనార్ధికి ధనము , మోక్షార్ధికి మోక్షము ... ఇలా ఏ భావముతో పూజిస్తే అది సిద్ధిస్తుంది అని పూజారి తెలిపారు . ఇక్కడ నమ్మకమే ఒక ఔషధము లా పనిసేస్తుంది .గణపతి మంత్రము నిష్టగా జపం చేస్తే అభీష్టాలు సిద్ధిస్తాయని నమ్మకము . గణపతిని స్మరించినా విఘ్నాలు తొలుగుతాయి . స్వామి దీక్ష చేపట్టి 11, 21, 41 దినాలు ఇంట్లో పూహించుకుంటే సర్వాభీష్టాలు నెరవేరుతాయని అంటారు .
ఈ మాలధారణ వినాయక చవితి రోజుల్లోనే కాకుండా .. సంవత్సరం పొడుగునా ఎప్పుడైనా ఒక శుభమూర్తాన మాల ధరించవచ్చని గురుస్వాములు అంటారు .
రచించినది: కోటి మాధవ్ బాలు చౌదరి