భక్తి మార్గము :
ముక్తిని పొందేందుకు భక్తి ఒక మార్గము . జీవునికి , దేవునికి మధ్య వారధి భక్తి . కాల ప్రవాహానికి ఒడిదుడుకులకు అతీతమయినది భక్తి . హిందూధర్మ సంస్కృతిలో భక్తి గురించిన విశేషాలు అనేకానేకము ఉన్నాయి . సాధకులు , ఆరాధకులు ఏవిధమ్ముగా ఉండాలో మనకు నారదభక్తి సూత్రాలు విపులీకరించాయి . భక్తి తో తన ఇస్టదైవాన్ని ఆరాధిస్తే మనస్శాంతి కలుగు తుంది . మనసు లో చెడు ఆలోనచలము తావుండదు . . . సన్మారగము లో నడిచేందుకు వీలుపడుతుంది . ఎన్నో మానసిక వ్యాధులకు దూరంగా ఉండవచ్చును . నిత్యజీననం లో వత్తిళ్ళకు , వడిదుడుకులకు తట్టుకునే మనోధైర్యం కలుగుతుంది . మనసు ప్రశాంతం గా ఉంటే శరీరము ఆరోగ్యం గా ఉంటుంది . 80 శాతము శరీరక రుగ్మతలకు మానసిక ఆందోళనే కారణము . భక్తి తో వీటినన్నింటినీ అధిగమించవచ్చును .
- భగవంతుదుని ఆరాధించడమే భక్తి అని పరాశరుడు తెలియజేసాడు .
- భగవంతుని లీలావిశేషాల గురించి తెలుసుకోవడమే భక్తి అని గార్గుడు తెలియజెప్పాడు .
- మన:పరిపక్వ సాధనే భక్తి అని అంటాడు శాండిల్యుడు .
- రామానుజాచార్యులు , మధ్యాచార్యులు కూడా భక్తి మార్గము గురించి ఉత్తమోత్తమము గా తెలియజేసారు .
- కర్మ , జ్ఞాన , యోగ మార్గదర్శకమే భక్తి మార్గము . గుణ , రూప , పూజ , సఖ్య , వాత్సల్య , మాధుర్య , ఆత్మనివేధన , తన్మయ మరియు విరహ - ఇలా అనేక భక్తి మార్గాల గురించి నారదభక్తి సూత్రాలలో వివరించబదింది .
శ్రవణ భక్తి , కీర్తం భక్తి , స్మరణ భక్తి , పాదసేవ భక్తి , వందనభక్తి , దాస్య భక్తి , అర్చనభక్తి , స్నేహభక్తి , అత్మానుసందాన్యభక్తి , మొదలైనవి .
- భక్తి మారగములో ద్యాన భక్తికి ఒక ప్రత్యేకత ఉంది ... త్యాగరాజు , పురందరదాసు మొదలైన వారు భక్తిపారమార్ధ్యాన్ని పానం చేసిన మహనీయులు .
- కీర్తన భక్తి కి - రామదాసు , అన్నమయ్య
- శ్రవణభక్తికి - గోపికలు , రుక్మిణి ,
- స్మరణభక్తి కి - నారద , తుంబుర , ప్రహ్లాదులు ,
- పాదసేవన భక్తి కి - శబరి , భరతుడు , లక్ష్మణుడు ,
- అర్చన భక్తికి - కన్నప్ప , ఏకలవ్యుడు , నంది ,
- వందన భక్తి కి - మానవులు ,
- దాస్య భక్తి కి - హనుమంతుడు , గరుత్మంతుడు ,
- స్నేహభక్తి కి - సుగ్రీవుడు , విభీషణుడు ,
- ఆత్మనివేదన భక్తికి - కుబేరుడు , అర్జునుడు .