ఆంధ్ర వల్లభుడు... ఆంధ్ర నాయకుడు... ఆంధ్ర మహావిష్ణువు... ఇంకా మరెన్నో పేర్లతో భక్తుల పూజలందుకుంటున్నాడు శ్రీకాకుళేశ్వరస్వామి. కలియుగంలో పాపభారం తగ్గించేందుకు ఈ స్వామి ఆవిర్భవించాడని భక్తుల విశ్వాసం. కృష్ణాజిల్లాలోని ఈ క్షేత్రానికి చారిత్రకంగానూ పౌరాణికంగానూ ఎంతో ప్రాధాన్యముంది.
శ్రీకాకుళేశ్వరస్వామి... కృష్ణాజిల్లా ఘంటసాల మండలంలోని శ్రీకాకుళం గ్రామంలో కొలువై ఉన్నాడు. ప్రసిద్ధి చెందిన 108 పుణ్యక్షేత్రాల్లో ఇది 57వదిగా చెబుతారు. శ్రీకాకుళంలో స్వామివారు స్వయంభువుగా వెలసి పాపాలను హరిస్తున్నాడని భక్తుల నమ్మిక. ఈ శ్రీకాకుళ క్షేత్రం సాక్షాత్తూ బ్రహ్మదేవుని ప్రయత్నం మేరకే ఉద్భవించిందని ఒక పురాణ కథనం.
కలియుగంలో రోజురోజుకీ పాపాలు పెరిగిపోతున్నాయని దేవతలంతా వ్యాకులత చెందారట. వాళ్లంతా చతుర్ముఖ బ్రహ్మతో సహా భూలోకానికి వచ్చి ఒక ప్రదేశంలో మహావిష్ణువు కోసం తపస్సు ప్రారంభించారు. ఆ తపస్సుకి మెచ్చి మహావిష్ణువు ప్రత్యక్షం కాగా... ‘భూలోకంలో ఈ ప్రాంతంలోనే మీరు కొలువై ఉండి భక్తుల పాపాలను హరించాలని’ వారు కోరారట. అందుకు నారాయణుడు సమ్మతించడంతో చతుర్ముఖ బ్రహ్మే స్వయంగా శ్రీమహావిష్ణువును అక్కడ ప్రతిష్ఠించాడట. బ్రహ్మకు ఆకులమైనందుకు కాకుళమని పేరు వచ్చిందనీ శ్రీహరి ఆచోటనే ప్రతిష్ఠితుడైనందుకు కాకుళేశ్వరుడిగా కీర్తినొందాడని పురాణ కథనం.
కొన్నాళ్లు అదృశ్యం
ఉపనిషత్తుల ప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు వరుసగా సంస్కృత, ఆంధ్ర, ప్రాకృత భాషలు అత్యంత ప్రియమైనవి. ఆంధ్రభాషపై ప్రీతిగల మహావిష్ణువే శ్రీకాకుళంలో కొలువుదీరాడనీ పురాణోక్తి. ప్రాచీనకాలంలో ఇక్కడికి సమీపంలోనున్న నదీమార్గాన వ్యాపారాలు జరుగుతుండేవి. దారినపోయే నావికులు ఈ ప్రాంతానికి వచ్చి స్వామిని దర్శించుకుని వెళ్లేవారట. వాళ్లంతా ఈ ప్రాంతాన్ని సిరికొలను, సిరికికొలను అని పిలిచేవారట. అదే కాలక్రమేణా శ్రీకాకుళంగా మారిందని చెబుతారు.
క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దంలోనే ఇక్కడ స్వామికి ఆలయం ఉండేదట. ఆపై ఇక్కడి స్వామి అదృశ్యమైపోయాడట. దాదాపు వెయ్యేళ్లపాటు ఎవ్వరికీ కనిపించలేదట. ఆ తరువాత కొన్నాళ్లకి... ఒరిస్సా పాలకుడైన అంగపాలుడి ప్రధానమంత్రి నరసింహవర్మ ఓసారి కాంచీపురానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో కృష్ణాతీరానున్న శ్రీకాకుళానికి వచ్చాడు. ఈ క్షేత్ర మహిమ తెలుసుకుని, అదృశ్యమైన విగ్రహం ఎక్కడుందో కనిపెట్టి పునఃప్రతిష్ఠ చేయాలని నిర్ణయించుకున్నాడట. దానికోసం ఎన్నో గ్రామాల్లో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడట. ఓరోజు రాత్రి స్వామి ఆయన కలలో కనిపించి వేమశర్మ అనే బ్రాహ్మణుడి ఇంటి ఆవరణలో ఉన్నానని చెప్పాడట. వెంటనే నరసింహవర్మ ఆ ప్రాంతానికి వెళ్లి తవ్వకాలు జరపగా విగ్రహం బయటపడింది. దాన్ని శ్రీకాకుళానికి తీసుకొచ్చి పునఃప్రతిష్ఠించినట్లు చెబుతారు.
రచించినది: కోటి మాధవ్ బాలు చౌదరి